కావాల్సిన ప‌దార్థాలు:
క్యారెట్‌ తురుము- ఒక కప్పు  
గులాబ్‌జామ్‌ పౌడర్‌- 2వంద‌ల‌ గ్రా
కొబ్బరి తురుము- ఒక కప్పు 

 

పంచదార- రెండు కప్పులు
పాకానికి పంచదార-అర కేజి
యాలకుల పొడి- ఒక టీస్పూన్‌

 

నెయ్యి-అర కప్పు
జీడిపప్పు- కొద్దిగా
బాదం పప్పు- కొద్దిగా

 


తయారీ విధానం: 
ముందుగా స్టౌ మీద ఒక పాన్ పెట్టుకొని.. అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి అవి వేగాక, క్యారెట్‌ తురుము వేసి వేగించాలి. తరువాత కొబ్బరి తురుము కూడా వేసి వేగించాలి. ఇప్పుడు అందులో పంచదార వేసి కాస్త దగ్గరగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చివరిగా యాలకుల పొడి చల్లి దించేయాలి. తరువాత మరో పాన్ స్టవ్‌పై పెట్టి అందులో కాసిని నీళ్లు, పంచదార వేసి లేత పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చివ‌రిగా పాకంలో యాల‌కుల పొడి వేసి క‌లిపి ప‌క్క‌న పెట్టేసుకోవాలి.

 

ఇప్పుడు గులాబ్‌జామ్ పిండిని కలిపి ఉండ‌లుగా చేసి పెట్టుకోవాలి. అలాగే క్యారెట్‌ హల్వాను కూడా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గులాబ్‌జామ్‌ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో క్యారెట్‌ ఉండను ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి. ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి పంచదార పాకంలో వేస్తే స‌రిపోతుంది. అంతే క్యారెట్‌ గులాబ్‌ జామ్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: