కావాల్సిన‌ పదార్థాలు: 
అరటి పువ్వు తరుగు- రెండు కప్పులు
మిరియాల పొడి- అర టీ స్పూను
ఉల్లి తరుగు- అరకప్పు
బంగాళదుంప- రెండు

 

కరివేపాకు- ఐదు రెమ్మ‌లు
కొత్తిమీర- ఒక క‌ట్ట‌
అల్లం- చిన్న‌ ముక్క
పచ్చిమిర్చి- రెండు

 

బ్రెడ్‌ పొడి- తగినంత
నూనె- స‌రిప‌డా
పసుపు- చిటికెడు

 

గరం మసాల- ఒక టీ స్పూను
ఉప్పు- రుచికి తగినంత
గుడ్డు- ఒక‌టి

 

తయారుచేసే విధానం: 
ముందుగా బంగాళ‌దుంప‌ల‌ను ఉడికించి పేస్ట్‌లా చేసి ప‌క్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి పువ్వు తరుగు బాగా కడిగి, తగినంత నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. త‌ర్వాత పాన్‌లో నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగును ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. 

 

ఇప్పుడు గరం మసాల, మిరియాలపొడి, ఉప్పు, ఉడికించిన పువ్వు తరుగు, బంగాళదుంప గుజ్జు వేసి బాగా కలపాలి. నిమిషం తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ ముద్దను కట్‌లెట్స్‌గా చేసుకుని గిలకొట్టిన గుడ్డులో ముంచి, బ్రెడ్‌ పొడిలో దొర్లించి నూనెలో దోరగా వేగించాలి. అంతే క్రిస్పీ క్రిస్పీ అరటి పువ్వు వడలు రెడీ. వీటిని వేడి వేడిగా ఏదైనా సోస్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: