'దిశ' హత్యాచార ఘటన అందరికి తెలిసిందే. 'దిశ'ని అత్యంత గోరంగా రేప్ చేసి, చంపేసిన నలుగురు నిందితులని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఘటన అనంతరం పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. కాని కొంతమంది మాత్రం దీనిని ఖండించారు..


టాలీవుడ్ మరియు బాలీవుడ్, రాజకీయ నాయకులు అందరు కూడా దిశ హత్యకేసు హంతకుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.. సరైన న్యాయం చేసారు అని అన్నారు చాలామంది ప్రముఖులు.

మంచు లక్ష్మి స్పందించి "ఎన్ కౌంటర్ ని తప్పుబట్టింది. తప్పు చేసిన వారిని త్వరగా శిక్షించడం మంచిదే కాని... ఇది న్యాయమా? అని నేను ప్రశ్నిస్తున్నా? తప్పు చేసిన ప్రతివాళ్ళని శిక్షించాలంటే, ఎంతమందిని ఎన్ కౌంటర్ చేస్తారు? పాపం చనిపోయిన వాళ్ళ  తల్లి తండ్రులు ఎంతగా బాధపడతారో ఆలోచించారా !పాపం వాళ్ళు చదువుకోని  వారు, వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళలా ఉన్నారు. ఎన్నో కష్టాలు పడి వాళ్ళు పిల్లల్ని పెంచారు. ఇప్పుడు పిల్లల్ని కోల్పోయిన తల్లి తండ్రులు ఎంత బాధని అనుభవిస్తారు"ఇది న్యామమేనా? నిర్భయ కేసులో శిక్ష పడి ఏడు ఏళ్లయినా ఎప్పటికి శిక్ష పడలేదని తన అభిప్రాయాన్ని తెలిపింది మంచు వారి అమ్మాయి.

ఇది ఇలా ఉండగా ఎన్ కౌంటర్ కి సమ్మతినిచ్చిన శ్రీ రెడ్డి మాత్రం మంచు లక్ష్మి మాటలని ఖండించారు. అసలు అది' నోరా లేక డ్రైనేజా 'అని అంది. అన్ని మూసుకుని కూర్చో, వాళ్ల  తల్లితండ్రులు ఎంత భాద పడిఉంటారో అని అన్నావ్, పిల్లల్ని అలా పెంచినందుకు వాల్ల తల్లితండ్రులు కూడా శిక్షార్హులే అంది.

పేద వాళ్ళుకాబట్టి కాల్చేశారు అన్నావ్.... మరి అప్పుడు కాస్టింగ్ కౌచ్ విషయంలో ఎందుకు  నోరు విప్పలేదు. "అసలు మొహం కడుకున్నావో లేదో తెలీదు.. ఆ పెదవులు చూస్తే వాంతులు వచ్చేలా ఉన్నాయి. కనీసం మొహం కడుక్కుని రా... అలా ఎలా  పడితే అలా మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడం కాదు" అని శ్రీ రెడ్డి రెచ్చిపోయింది.


ఎవరింట్లో బాగోతం వాళ్ళకి తెలియదు అని.... మీ ఇంట్లో విడాకులు తీసుకుని విడిపోవడం లేదా ఏంటి?  అని మంచు మనోజ్ ని కూడా లాగింది. అన్ని మూసుకుని కూర్చుంటే బాగుంటుంది అని శ్రీ రెడ్డి ఫైర్ అయింది.. ఈ వివాదం ఎక్కడి దాక వెళ్తుందో !!.

మరింత సమాచారం తెలుసుకోండి: