పప్పు.. అమ్మ చేసిన పప్పు అన్నం.. అమృతం అని చెప్పాలి. అయితే పప్పులో ఎన్నో రకాల పప్పులు ఉంటాయి. కంది పప్పు.. పచ్చి మిర్చి పప్పు, ఎర్రపప్పు, మెంతి పప్పు, కర్వేపాకు పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల పప్పు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కొబ్బరి పప్పు ఎలా చెయ్యాలి అనేది చదివి తెలుసుకోండి. ఈ కొబ్బరి పప్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది.. రుచిని ఇస్తుంది. అయితే ఈ పప్పు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                           

కావలసిన పదార్థాలు... 

 

పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క, 

                         

పెసరపప్పు-రెండు కప్పులు, 

 

పచ్చిమిర్చి-మూడు,         

                    

ఉల్లిపాయలు- చిన్నవి రెండు, 

 

నూనె సరిపడా, 

 

ఆవాలు సరిపడా, 

 

జీలకర్ర-పోపుకు సరిపడా, 

 

పసుపు-చిటికెడు, 

 

ఉప్పు-రుచికి సరిపడా, 

 

మంచినీళ్లు- అర కప్పు.

 

తయారీ విధానం... 

 

ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ఓ గిన్నెలో పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి, మంచినీళ్లు పోసి ఉడికించాలి. ఆఖర్న రుచికి తగినంత ఉప్పు కలుపుకుని దించేయాలి. అంతే - కొబ్బరి పప్పు తయారైనట్లే. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పప్పు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతంగా ఉండే పప్పుని ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: