ఓ మహిళకు నాలుకకు కాన్సర్ సోకింది. దీంతో వైద్యులు ఆమె నాలుకలో సగ భాగాన్ని తొలగించారు. దీంతో ఆమె ఇక పై నేను మాట్లాడనేమోనని భావించింది. కానీ ఆమెకు వైద్యులు చెప్పింది విని ఒక్కసారిగా ఆశలు చిగురించాయి.  వైద్యులు ఆమెకు చిప్పినట్లే ఆమె నాలుకను తిరిగి సృష్టించగలిగారు. ఆమె చేతి కండరాలనే నాలుకగా మలచి ఆమెకు తిరిగి మాటలు వచ్చేలా చేశారు.   


ఈ ఘటన యూకేలోని బకింగ్హామ్‌షైర్‌‌ లో గల ఇల్సుబ్యూరీ కి చెందిన స్టెఫానీ విగ్లెస్వర్త్ అనే మహిళకు నోటిటో అల్సర్ ఏర్పడింది. అది క్రమేనా క్యాన్సర్‌గా మారి నాలుక చచ్చుబడేలా చేసింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె పొలుసుల కణ క్యాన్సర్ తో  బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఆమె క్యాన్సర్ నుంచి బయటపడాలంటే నాలుకలో సగభాగాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. దీనివల్ల ఆమె మాట కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. నాలుక మొదలు నుంచి గొంతు భాగం వరకు ఉండే భాగాన్ని తొలగించాలని చెప్పారు. తొలగించిన నాలుక భాగంలో చేతి కండరాలను అమర్చడం ద్వారా నాలుకను తిరిగి పొందవచ్చని తెలిపారు. ఇది క్లిష్టమైన ప్రక్రియ అని తెలిసినా.. స్టెఫానీ వద్ద మరో మార్గం లేదు. వైద్యులపై నమ్మకం ఉంచి సర్జరీకి సిద్ధమైంది.


ప్రస్తుతం స్టెఫానీ ద్రవ రూపంలో ఆహారాన్ని తీసుకుంటుంది. నాలుకకు సమస్య లేకుండా స్ట్రా ద్వారా తాగుతోంది. మాట్లాడటానికి ఇబ్బంది పడుతోంది. ‘‘నా నాలుక కంటే.. కండరాలను తొలగించిన చేతి భాగమే ఎక్కువగా నొప్పి వస్తోంది. నా మాట తిరిగి వస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది. స్మోకింగ్ వల్లే ఈ సమస్య ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది.


నేను స్మోకర్‌ను. ఈ దురాలవాటు వల్ల ఈ వ్యాధి రావడం సబబే అనుకున్నా. కానీ, నాకు నా పిల్లలతో కలిసి ఉండాలని ఉంది. అదే నాలో పట్టుదలను పెంచింది. నేను తిరిగి కోలుకుంటానని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు క్యాన్సర్ పూర్తిగా నయమైంది’’ అని స్టెఫానీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: