దిశ నిందితుల ఎన్ కౌంటర్ విచారణపై సుప్రింకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కమీషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిటికి ఛైర్మన్ గా మహారాష్ట్ర హై కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పూర్కర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా రేఖాప్రతాప్, సిబిఐ మాజీ ఛీఫ్ కార్తికేయన్ ఉంటారు. ఆరు మాసాల్లోనే నివేదికను అందచేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది.

 

మొత్తానికి ఈరోజు ఉదయం సుప్రింకోర్టులో దాదాపు గంటన్నరపాటు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరిగింది. తర్వాతే ప్రత్యేక విచారణ కమీషన్ ను నియమించాలని డిసైడ్ చేసింది.  తాము నియమించిన విచారణ కమీషనే ఎన్ కౌంటర్ పై పూర్తిస్ధాయిలో విచారణ జరుపుతుందని కాబట్టి మిగిలిన అన్నీ దర్యాప్తులను నిలిపేయాలని సుప్రిం తేల్చి చెప్పింది.

 

మొత్తానికి  ఎన్ కౌంటర్ తెలంగాణా పోలీసుల మెడకు చుట్టుకునేట్లే కనబడుతోంది. ఎందుకంటే ఎన్ కౌంటర్ తర్వాత సైబరాబాద్ కమీషనర్ విసి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు, తర్వాత మానవహక్కుల సంఘం విచారణలో పోలీసు అధికారుల వ్యాఖ్యలపై సుప్రింకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది.

 

అదే సమయంలో సుప్రింకోర్టులో తెలంగాణా పోలీసుల తరపున వాదనలు వినిపించిన లాయర్ మాట్లాడుతూ నిందితులపై కాల్పులు జరిపిన  బుల్లెట్లు కనబడలేదని చెప్పారు. లాయర్ వాదనలతో సుప్రింకోర్టు విభేదించింది. విచారణ కమీషన్ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తుందని చెప్పిన కోర్టు ఆ విచారణలోనే అన్నీ విషయాలు తేలుతాయని స్పష్టంగా ప్రకటించింది.

 

ఎన్ కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు పోలీసులకు బాగా వ్యతిరేకంగా తయారైందన్న విషయం తెలిసిపోతోంది. పైగా నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావటం కూడా పోలీసులకు ఇబ్బందులు పెడుతోంది. ఎన్ కౌంటర్ పై పోలీసులు చెబుతున్న మాటలను, లాయర్ వాదనలను కోర్టు నమ్మలేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. మరి విచారణ సందర్భంగా పోలీసులు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: