చక్కర పొంగలి.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ చక్కర పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. ఈ చక్కర పొంగలి ఎంతో అద్భుతంగాను ఉంటుంది. అయితే ఈ చక్కర పొంగలిని ఎప్పుడు గుడిలో పెట్టిన ప్రసాదం తినడం తప్ప రియల్ గా ఎప్పుడు తిని ఉండరు. మరికొంతమందికి అయితే ఈ చక్కర పొంగలి ఎలా చెయ్యాలో కూడా తెలియదు. అలాంటి వారు ఈ చక్కర పొంగలిని ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు..


బియ్యం - ఒక కప్పు, 

 

బెల్లం - ఒకటిన్నర కప్పు, 

 

పెసరపప్పు - మూడు టేబుల్‌ స్పూన్లు, 

 

నెయ్యి - పావుకప్పు, 

 

యాలకుల పొడి - పావు టీ స్పూన్‌, 

 

జీడిపప్పు - పది పలుకులు, 

 

ఎండు ద్రాక్ష - రెండు టేబుల్‌ స్పూన్లు, 

 

పచ్చ కర్పూరం పొడి - చిటికెడు, 

 

జాజికాయ పొడి - చిటికెడు, 

 

నీళ్లు - నాలుగు కప్పులు.

 

తయారీ విధానం... 

 

బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఒక పాన్‌లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకోవాలి. అప్పుడు బెల్లం పానకం సరిగ్గా ఉన్నట్టు. తరువాత ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. చిన్నమంటపై నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి.యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి. నెయ్యిలో వేగించిన జాజికాయ పొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించి మిశ్రమంలో కలపాలి అంతే.. గుమగుమలాడే చక్కెర పొంగలి రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: