కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం- ఒకకప్పు
కందిపప్పు- ఒకటీస్పూన్
కొబ్బరిపొడి- రెండు టేబుల్‌స్పూన్లు

 

బెల్లం- ఒకకప్పు
అరటిపండు- ఒకటి
యాలకులు- నాలుగు
నెయ్యి- తగినంత

 

తయారీ విధానం:
బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి ఒకగంటసేపు నానబెట్టాలి. తరువాత నీళ్లు పూర్తిగా తీసివేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. మెత్తగా అయ్యాక బెల్లం వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు మిశ్రమం పలుచగా మారుతుంది. ఇప్పుడు అరటిపండును గుజ్జుగా చేసి వేయాలి. ఆ త‌ర్వాత యాలకులు కూడా వేసి క‌ల‌పాలి.

 

అలాగే కొబ్బరిపొడి వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు పొంగణాల పాన్‌ తీసుకొని నెయ్యి రాసుకోవాలి. గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని పాన్‌లో వేయాలి. కాసేపు వేగాక అప్పంలను తిప్పుకోవాలి. గోధుమరంగులోకి వచ్చే వరకు వేగించి సర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే వేడి వేడి నేతి అప్పం రెడీ. వీటిని చిన్న పిల్ల‌ల‌కైనా.. పెద్ద‌ల‌కైనా ఎంతో ఇష్టంగా తిడ‌తాడు. సో.. ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: