కావాల్సిన ప‌దార్థాలు:
బొంబాయి రవ్వ- రెండు కప్పులు
పంచదార- ఒక కప్పున్నర
కుంకుమ పప్పు- రెండు టీ స్పూన్లు
జీడిపప్పు- పావుకప్పు

 

బాదంపప్పు- పావు కప్పు
ఎసెన్స్‌- ఒక టీ స్పూను
నీళ్లు- పావు కప్పు
నెయ్యి- ఒక కప్పు

 

తయారీ విధానం: 
ముందుగా స్టౌ మీద పాన్‌ పెట్టి.. అందులో ఒక టేబుల్‌ స్పూను నెయ్యితో రవ్వ వేసి వేగించుకోవాలి. తరువాత మరో పాన్‌ పెట్టి మరో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పుని కూడా వేగించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో పంచదార వేసి నీళ్లు పోసి బాగా మరిగించాలి. 

 

పాకం చిక్క పడకముందే వేయించిన ర‌వ్వ‌, నెయ్యి, కుంకుమ పువ్వు వేసి గరిటతో బాగా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, ఎసెన్స్‌ కూడా వేసి కలిపాక ఒక ప్లేటుపై వేసుకోవాలి. త‌ర్వాత ప్లేట్‌లో స‌రిగ్గా సెట్‌చేసి మ‌న‌కు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్‌చేసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన క‌రాచి హ‌ల్వా రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: