చింతకాయ అంటేనే పులుపు.. పులుపు చాలా తక్కువ తింటుంటాము. కానీ ఈ పులుపు చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు తింటాం కదా అందుకే పులుపు చాల బాగుంటుంది. అయితే దోసకాయ, చింతకాయ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే అలాంటి ఈ చట్నీని ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. అలాంటి వారందరు చింతకాయ, దోసకాయ చట్నీ ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. అలాంటివారంతా ఆ చింతకాయ, దోసకాయ చట్నీ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                   

కావలసిన పదార్థాలు: 

                 

చింతకాయలు -15, 

 

దోసకాయ - 1, 

 

వేగించిన వేరుశనగ పప్పు - అర కప్పు, 

 

పచ్చిమిర్చి - 4, 

 

దనియాలు - అర టేబుల్‌ స్పూను, 

 

జీలకర్ర - అర టేబుల్‌ స్పూను, 

 

కొత్తిమీర - 1 కప్పు,

 

తాలింపుకు కావాల్సిన పదార్థాలు.. 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

మినప్పప్పు + జీలకర్ర - 1 టీ స్పూను,

 

ఇంగువ - చిటికెడు, 

 

మెంతిపొడి - అర టీ స్పూను.

 

తయారీ విధానం.. 

 

గింజలు తీసిన చింతకాయల్లో కొత్తిమీర వేసి ముద్దలా దంచిపెట్టుకోవాలి. కడాయిలో కొద్ది నూనె వేసి దనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేగించి తీసి వేరుశనగపప్పు కూడా కలిపి మిక్సీలో వేసుకొని ముద్దలా చేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, మెంతిపొడి, ఇంగువతో పాటు దోసముక్కలు వేగించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, చింతకాయ మిశ్రమం చేర్చి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అన్నంతోనూ, దోశల్లోకి కూడా ఈ చట్నీ బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: