అమ్మ అనే మాటలోనే కాదు, అమ్మ ప్రేమలోనూ మాధుర్యం ఉంటుంది.. "అమ్మ అను మాట కన్నా... మిన్నా ఏముందిలేరా కన్నా " అని ఒక కవి వివరించాడు. అంత మధురమైనది, స్వచ్ఛమైనది అమ్మ ప్రేమ.

 

కడుపులో బిడ్డ పడిన దగ్గర నుండి బయటకి వచ్చే దాక ఎన్నో భాదలు పడి మనకి జన్మ నిస్తుంది తల్లి. మనల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, ఒక ఇంటివాళ్ళని చేస్తుంది.వృద్ధులయ్యాక పిల్లలతో కలిసి ఉండాలని, మనవడు మానవరాళ్లతో ఆడుకోవాలని ఆశ ఉంటుంది...

 

కన్నప్రేమ తెంచుకున్న తెగిపోదు... కాని కన్నప్రేమని,   పెంచిన ప్రేమని మరిచిపోయి పిల్లలు మాత్రం కన్నవాళ్ళని వదిలేస్తున్నారు.. అవసరం అయిపోయాక టిష్యు పేపర్ లాగా పారేస్తున్నారు.. అన్ని మర్చిపోయి అమ్మ నాన్నలని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు.. చూడడానికి టైం లేదని, ఉద్యోగం నెపంతో వృద్దాశ్రమాలలో వదిలేసి వెళ్లిపోతున్నారు.

 

అమ్మ నాన్న బాధ్యత కొడుకులది అంటారు... కొడుకులు వదిలేసినా తల్లి తండ్రులని చూసాము. కాని తల్లి ని వదిలేసిన కూతుళ్ళని ఎక్కడ చూడలేదు.. కాని ఈ ఓడిన అమ్మ కధలో మాత్రం కూతుళ్లే కసాయి వాళ్ళలాగా ప్రవర్తించారు.

 

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. పెద్ద చెరువులో దూకి.. భారతి అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లున్నారు. కానీ వయసు మీద పడిన తల్లి బాగోగులను చూసే మనసే వారికి కరువైంది. చిన్నప్పుడు అమ్మ తమను ఎంత గారాబంగా పెంచిందో మర్చిపోయి.. అమ్మ ప్రేమను భారంగా భావించారు.

 

ఒక సంవత్సరం క్రితం తల్లిని ముగ్గురు కూతుళ్ళు కలిసి ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసారు... మనవాళ్ళు, మానవరాళ్లతో ఆడే వయసులో వృద్ధాశ్రమం లో ఉండలేక తల్లి ప్రేమ తల్లడిల్లింది. ఒక పక్కా కట్టుకున్న భర్త లేడు, ఇంకో పక్కా కడుపున పుట్టిన ముగ్గురు కూతుళ్లు వదిలేసి వెళ్లిపోయారు.. తన ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక, తన కష్టం, సుఖం, బాధ ఎవరికీ చెప్పాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

 

వృద్ధాశ్రమo నుంచి బయటకి వచ్చి, కూతుళ్ళకి భారం గా ఉండకూడదని మీర్ పేట పెద్ద చెరువులో దూకి బలవన్మరణం చేసుకుని శవమై తేలింది. పెద్ద చెరువులో శవం తేలడం  చూసి స్థానికులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.. పోలీస్ లు శవాన్ని గుర్తించి భారతిగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కంటే కూతుర్నే కనాలి అన్న మాటకి ఇప్పటి సమాజం కొడుకయిన, కూతురయినా ఒకటే అని నిరూపించారు. "ఇప్పుడు కూతుళ్లే  కాని రేపటి తల్లులు ""అన్నా విషయం వాళ్ళకి ఎప్పటికి గుర్తువస్తుందో  ?? 

మరింత సమాచారం తెలుసుకోండి: