కాకరకాయ ఎంత చేదు ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే కాకరకాయలో కూడా ఆకాకరకాయ అని చేదు లేని కొన్ని కాకరకాయలు ఉంటాయి. ఆ కాకరకాయ తినడం వల్ల చేదు తక్కువ ఉంటుంది. అలాంటి రుచికరమైన కాకరకాయ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                                 

కావలసిన పదార్థాలు.. 

                                

ఆకాకరకాయలు - పావు కిలో, 

 

ఉల్లిపాయలు - 4, 

 

పచ్చిమిర్చి - 3, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

కారం - అర టీ స్పూను, 

 

పసుపు - చిటికెడు, 

 

పాలు - 1 టేబుల్‌ స్పూను, 

 

అల్లం వెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను, 

 

కొత్తిమీర తరగు - 1 టేబుల్‌ స్పూను. 

 

తాలింపు కోసం..  

 

శనగపప్పు, 

 

మినప్పప్పు, 

 

ఆవాలు, 

 

జీలకర్ర

 

కరివేపాకు, 

 

నూనె - తగినంత.

 

తయారీ విధానం... 

 

ఆకాకారకాయల్ని తొక్క తీయకుండా తొడిమలు మాత్రమే తొలగించి గింజలతో పాటు సన్నగా తరిగి పెట్టుకోవాలి. కడాయిలో తాలింపు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేగించి ఆకాకర ముక్కలు, పసుపు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి సన్నమంటపైన మగ్గనివ్వాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేయాలి. 3 నిమిషాల తర్వాత పాలు పోయాలి. నీరంతా ఇగిరి కూర ముద్దగా అయిన తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: