ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సెంగర్ ను  రేప్ కేసు లో దోషిగా ఖరారు చేసారు. త్వరలో ఆయనకు శిక్ష పడుతుంది. ఇంతకీ ఆయన ఎం చేశాడు..?

ఒక మైనర్‌ బాలికను అపహరించాడు..  రేప్‌ చేశాడు.. ఉద్యోగమిప్పిస్తానని హామీ ఇచ్చాడు.. తరువాత ఆ బాలికపై మరి ఎమ్మెల్యే అనుచరులు కూడా అత్యాచారం చేశారు. న్యాయం కోసం బాధితురాలు జరిపిన పోరాటంలో ఆమె తండ్రి పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు.ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

 

 

అయితే ఇలాంటి దారుణాలు దేశంలో గతంలో  ఎన్నో జరిగాయి. ఇదే యూపీ లో షాజహాన్‌పూర్‌కు చెందిన బీజేపీ మాజీ నేత చిన్మయానంద్‌పై ఒక యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆయనకు చెందిన కళాశాలలో ఉద్యోగమిచ్చి అనంతరం ఆమెను బ్లాక్‌మెయిల్‌చేసి అత్యాచారం చేశారు. చిన్మయానంద్‌ను అరెస్టు చేసిన పోలీసు బృందం ఈ కేసుకు సంబంధించిన పలు వీడియో ఆధారాలను సేకరించింది.

 

 

 

1995లో దిల్లీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నేత సుశీల్‌ శర్మ తన భార్యా నైనా సాహ్నిని అనుమానంతో కాల్చాడు.  మృతదేహాన్ని తండూరీ పొయ్యిలో వేసి తగలబెట్టాడు. నిందితులు సుశీల్‌శర్మకు న్యాయస్థానం యావజ్జీవ కారాగారశిక్షను విధించింది.

 

 

కేరళలోని  సూర్యనెళ్లిలో 16 ఏళ్ల మైనర్‌ బాలికను దాదాపు  రెండునెలలు బందీగా చేసి 40 మంది ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో పలువురు రాజకీయవేత్తలు ఉన్నారు. ఆమెకు జీవనోపాధిగా ఉద్యోగం కల్పించినా ఆమెను వారు వెంటాడటం మానలేదు. ఈ కుటుంబం తమ స్వస్థలాన్ని వదిలి వేరే చోటకు వెళ్లిపోయింది. ఈ కేసు లో ఇంకా న్యాయం జరగలేదు. ఇలా చెప్పుుంటూపోతే ఎమ్మెల్యే ల అరాచకాలు ఎన్నో..?

మరింత సమాచారం తెలుసుకోండి: