వంకాయతో ఫ్రై చేస్తాం.. మసాలా వంకాయ చేస్తాం, పచ్చడి చేస్తాం.. పప్పు చేస్తాం.. అలాంటి వంకాయతో టమోటా కలిపి ఎప్పుడైనా పప్పు చేశారా ? ఎంత బాగుంటుందో తెలుసా ? వంకాయ టమోటా పప్పుని ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకొండి.. ఇంట్లో చేసి పెట్టండి.. 

 

కావలసిన పదార్థాలు.. 

 

వంకాయలు - పావు కేజీ, 

 

కందిపప్పు - అరకప్పు, 

 

టమోటాలు - 2, 

 

పచ్చిమిర్చి - 2, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

చింతపండు - నిమ్మకాయంత, 

 

పసుపు - అర టీ స్పూను, 

 

కొత్తిమీర తరుగు - అరకప్పు, 

 

నూనె

                                       

ఆవాలు,  

                              

జీలకర్ర

            

కరివేపాకు, 

 

ఇంగువ

 

మినపప్పు - సరిపడా.

 

తయారీ విధానం..  

 

కప్పు నీటిలో పప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. అవసరం అయితే మరో కప్పు నీరు కలిపి జారుగా మెదిపి పక్కనుంచాలి. నూనెలో తాలింపు వేగాక పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించి టమోటా ముక్కలు కలపాలి. ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, పప్పు వేసి 5 నిమిషాలు చిన్నమంటపై మరిగించి కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ పప్పు అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన వంకాయ టమోటా పప్పు చేసుకొని లాగించేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: