పుట్టిన రోజు, పెళ్లి రోజు, న్యూ ఇయర్స్‌ ఇలా ఏ పండుగ వచ్చినా, ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలన్నా కేక్ ఉండాల్సింది. కేక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అసలే క్రిస్టమస్ మరియి న్యూయర్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. కేక్ కావాలంటే బేకరికి పరుగులుపెట్టాల్సిందే అనుకుంటున్నారా?

 

 

కేవలం బేకరీలలోనే మాత్రమే కాకుండా రుచికరమైన ఫ్లేవర్‌తో సులభంగా ఇంటిదగ్గరే తయారుచేసుకోవచ్చు. కేక్‌ని తయారు చేయాలంటే మైక్రోవేవ్ ఓవెన్‌ ఉండాలి కదా అని అనుకోవచ్చు కాని అలాంటిదేమీ అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే సాధారణ ప్రెజర్ కుక్కర్ సాయంతో ఈజీగా కేక్‌ని తయారు చేసేయవచ్చు.
రుచికరమైన కేక్ తయారీకి ఏవేం కావాలో తెలుసుంకుందా.

కావలసినవి: 


1మైదా పిండి - 3 కప్పులు
2)పంచదార -2కప్స్ పొడిచేసినది
3)గుడ్లు -2కప్స్
4)వెన్న -1కప్
5)బేకింగ్ సోడా -2స్పూన్స్
6)పాలు -2కప్స్
7)వెనిలా ఎసన్స్ -2స్పూన్స్


తయారు చేయి విధానం :

ఒక పాత్రలో చక్కెరను తీసుకుని వెన్న వేసి కలపాలి.చెక్కర పూర్తిగా కరగాలి. అందులో బాగా కలిపిన గుడ్డు సొనను వేసి మెత్తాగా అయ్యేలా మిక్స్ చేయాలి. బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ స్పాంజ్ లాగా మెత్తగా ఉండి పైకి పొంగిద్ది. ఈ మిశ్రమంలో బేకింగ్ సోడా కలిపి పాలను చేర్చుతూ మెత్తగా మృదువయ్యేంతవరకూ కలుపుతూ ఉండాలి.

 

బేకింగ్ సోడా వల్ల కేక్ పొంగుతుంది. దీనిలో వెనీలా, మైదా, బట్టర్ వేసి మిక్స్ చేయాలి.బాగా మిక్స్ చేయాలి పిండి స్మూత్ గా రావాలి.
ఇప్పుడు మరొక పాత్ర తీసుకుని దానిలో కేక్ మిశ్రమం అంటుకోకుండా ఉండటానికి కొద్దిగా మైదాని అప్లై చేయాలి. తరువాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పాత్రలో వేయాలి. ఇప్పుడు టిన్‌లోకి సిద్ధంచేసి ఉంచిన మిశ్రమాన్ని ప్రెషర్‌ కుక్కర్‌లో ఉంచి సన్నని మంటపై 45 నిమిషాలు ఉండికించాలి.కుక్కర్ లో నీరు కి బదులు ఇసుక పోయాలి.

 

ఈ సమయం పూర్తి అయిన తరువాత కిందకుదించి మూతతీసి 10 నిమిషాలు చల్లారనివ్వాలి. తరువాత వెనిలా కేక్‌ని చాక్‌తో ముక్కలుగా కోసుకోవాలి. అంతే కేక్ రెడీ. బయట సూపర్ బజారులలో క్రీమ్ దొరుకుంతుంది.. కేక్ రెడీ అయ్యాక క్రీమ్ రాసి ముక్కలుగా కోసుకుని సర్వ్ చేసుకోవాలి.... 

మరింత సమాచారం తెలుసుకోండి: