పాయసం అంటే ఎవరు ఇష్టపడని వారు ఉండరు. అందులోను చలికాలం,పండగలు వస్తున్నాయి కదా!!వచ్చే చుట్టలకి ఏదన్నా స్వీట్ చేయాలనీ  ఉందా..అయితే సేమ్యా పాయసం  ఎలా చేయాలో చూద్దామా.. 


కావలిసిన పదార్దాలు:


1)సేమ్యాలు -1 కప్
2)పాలు -4 కప్స్
3)బెల్లం -1/4 కేజీ
4)సగ్గుబియ్యం -1/2 కప్
5)నెయ్యి -తగినంత
6)జీడిపప్పు, కిస్మిస్, బాదాం పప్పు - 100gms
7)యాలుక్కాయ పొడి -1 టేబుల్ స్పూన్.

తయారీవిధానం :

 

ముందుగా జీడిపప్పు, బాదాం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. సగ్గుబియ్యంని ముందుగా ఒక 15 నిముషాలు నానపెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయి. తర్వాత స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదాంపప్పు వేరు వేరు గా వేసి వేపుకోవాలి..

వేగాక తీసివేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.. తర్వాత అదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసి సేమ్యాని గోల్డిష్ కలర్ వచ్చేలా వేయించాలి.


తర్వాత అదే గిన్నెలో రెండు గ్లాసెస్ నీరు పోసి కాగాక నానపెట్టిన సగ్గుబియ్యం వేయాలి.ఇవి ఉడికాక వేయించిన సేమ్యా ని వెయ్యాలి. సేమ్యా మరియి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి .. తర్వాత వేరే స్టవ్ వెలిగించి గిన్ని పెట్టి అందులో పాలు పోసి బాగా కాగనివ్వాలి.సన్నమంట మీద కాగనివ్వాలి.పాలు కాగాక పక్కనపెట్టుకుని చల్లారనివ్వాలి.. పాలు మరగి మీగడ కనిపించాలి. అపుడే పాయసం చిక్కగా, రుచిగా ఉంటుంది.

 

ఇపుడు సేమ్యా సగ్గుబియ్యం ఉడికాక అందులో బెల్లం కలపాలి, బెల్లం అంత కరిగాక యాలుక్కాయ పొడి వేయాలి.. గరిటతో అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆపేసి ముందుగా కాగించి ఉంచుకున్న పాలు పోసి తిప్పాలి.. తర్వాత వేయించు ఉంచుకున్న బాదంపప్పు, కిస్మిస్, జీడిపప్పు వేయాలి. అంతే రుచికరమైన సేమ్యా, సగ్గుబియ్యం పాయసం రెడీ. చిన్న చిన్న బౌల్స్ లోకి సర్వ్ చేసి ఆరగించండి.... ఇంటికి వచ్చిన చుట్టాలకి రుచి చూపించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: