కామాంధుల అరాచకాలు పెరుగుతున్నాయి. చివరకు చిన్నపిల్లలను కూడా టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిథిలో ఆరేళ్ల క్రితం చిన్నారితో అనుచిత ప్రవర్తించిన ఓ కామాంధుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు రెండేళ్ల కఠిన కారాగారం విధించింది.

 

వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలకు వెళ్తున్న ఐదో తరగతి చదివే చిన్నారిని మార్గమధ్యలో అడ్డగించి అనుచితంగా ప్రవర్తించిన నిందితుడికి న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, 1,000 రూపాయల జరిమానా విధించింది.  పాతబస్తీలోని రాజన్నబౌలి నివాసి పల్లా శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రైవేటు డ్రైవర్. శంషాబాద్ పరిధిలోని ఓగ్రామంలో 2013 జులై 8 ఉదయం ఐదో తరగతి చదివే చిన్నారిని పాఠశాలకు వెళ్తుండగా దారిలో అడ్డగించాడు. ఆ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది చూసిన తోటి విద్యార్థిని చిన్నారి తండ్రికి సమాచారం అందించింది.

 

అంతే.. హుటాహుటిన అక్కడికొచ్చిన చిన్నారి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని దేహశుద్ధి చేశాడు. పోలీసులకు అప్పగించాడు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉంది. ఆర్జీఐ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. అనంతరం అతనిపై కోర్టులో అభియోగ పత్రం దాఖలుచేశారు.  తాజాగా విచారణ పూర్త శిక్ష ఖరారు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: