అల్లం చట్నీ.. ఇది ఎన్నో రకాల టిఫిన్లలో వేసుకొని తినచ్చు. ఎప్పుడు పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీనే తింటే మనకు బోర్ కొడుతుంది. అలాంటి వారు ఈ అల్లం చట్నీని చేసుకొని తినండి. ఈ అల్లం చట్నీ అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ చట్నీ ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

                               

కావలసిన పదార్థాలు... 

                                                               

అల్లం-1 కిలో, 

 

నూనె-100గ్రా, 

 

వెల్లుల్లి-50గ్రా, 

 

జీలకర్ర-50గ్రా, 

 

ధనియాలు-50గ్రా, 

 

పచ్చిమిర్చి-అర కిలో, 

 

కరివేపాకు-50గ్రా, 

 

పసుపు-అర టీస్పూన్‌, 

 

పుట్నాలు-పావు కిలో, 

 

బెల్లం-1 కిలో, 

 

ఉప్పు-150గ్రా. 

 

తయారీ విధానం...  

 

ముందుగా అల్లం పొట్టు తీసి ముక్కలుగా కోసుకుని ఒక ప్లేటులో ఉంచుకోవాలి. తర్వాత స్టవ్‌పై బాణలి ఉంచి, అందులో నూనె వేసి అల్లం ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి. దీనికి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ జత చేసి కొద్దిసేపు అన్నింటినీ వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేసి అందులో పుట్నాలు, బెల్లం, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అంతే నోరూరించే అల్లం చట్ని తయారైనట్లే. ఈ చట్నీని ఇడ్లీ లేదా దోశలో వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అల్లం చట్నీని చేసుకొని తినండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: