పాల వంకాయ.. అసలు ఈ పాల వంకాయ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ? మనం ఇన్నాళ్లు మసాలా వంకాయ కూర, గుత్తి వంకాయ కూర తిని ఉంటాము. కానీ ఈ పాల వంకాయ కూర గురించి ఎప్పుడు విని ఉండరు. అయితే అలాంటి పాల వంకాయ కూర ఎలా చేసుకొని తినాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఎంతో రుచికరమైన ఈ పాల వంకాయ కూరను ఇంట్లోనూ చేసి పెట్టండి. 

 

కావలసిన పదార్థాలు...  

 

లేత వంకాయలు - అరకిలో, 

 

కరివేపాకు - 4 రెబ్బలు, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

పాలు - 1 కప్పు, 

 

జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు - 1 టీ స్పూను. 

 

కారం - అర టీ స్పూను.

 

తయారీ విధానం...  

 

కడాయిలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టాక సన్నగా తరిగిన వంకాయముక్కలు కూడా వేసి మూతపెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. కూర ఉడుకుతున్నప్పుడు పాలు పోసి కదపకుండా మూతపెట్టి సన్నని సెగమీద ఉడకనివ్వాలి. కూర చిక్కబడ్డాక దించేయాలి. ఇది అన్నంలోకి కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వంటకాలు తినండి. రుచిగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: