బీట్‌ రూట్‌ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా ? ఈ పేరు వినగానే కొంతమందికి కడుపులో దేవేస్తుంది.. ఎందుకో తెలుసా ? బీట్‌ రూట్‌ కర్రీ అంటేనే బాబోయ్ ఎందుకు ఈ కర్రీ చేసావ్ అంటూ షాక్ అవుతారు. అలాంటి ఈ బీట్‌ రూట్‌ కర్రీని పచ్చడిలా తినాలి అంటే షాక్ అవ్వరా ? ఏంటి ?.. ఇంకా అసలు విషయానికి వస్తే.. బీట్‌ రూట్‌  పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పచ్చడి గురించి చాలామందికి తెలియదు. ఏది ఏమైనా ఈ బీట్‌ రూట్‌ పచ్చడి ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

కావలసిన పదార్థాలు.. 

 

మీడియం సైజు బీట్‌రూట్‌ - 1, 

 

కొబ్బరికోరు - పావు కప్పు, 

 

పచ్చిమిర్చి - 1, 

 

అల్లం తురుము - 1 టేబుల్‌ స్పూను, 

 

పెరుగు - ముప్పావు కప్పు, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

కొత్తిమీర తరుగు - అలంకరణకు, 

 

నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు - సరిపడా.

 

తయారీ విధానం...

 

బీట్‌రూట్‌ తొక్క తీసి, 4 పెద్ద ముక్కలుగా కట్‌ చేసి కొద్దినీటిలో ఒక విజిల్‌ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. ఈలోపున కొబ్బరి కోరు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా రుబ్బుకుని ఆవాలు, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టి పక్కనుంచాలి. ఉడికిన బీట్‌రూట్‌ ముక్కల్ని సన్నగా తురిమి, పెరుగు, ఉప్పుతో పాటుగా తాలింపు మిశ్రమంలో కలిపి కొత్తిమీరతో అలంకరించాలి. ఈ పచ్చడి బిర్యానీ రైస్‌, పరాటాలతో బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ పచ్చడి చేసుకొని తినేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: