కావాల్సిన ప‌దార్థాలు:
బంగాళాదుంపలు- ఐదు
పంచదార పొడి- ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూను

 

జీడిపప్పు- కొద్దిగా
బాదం పప్పు- కొద్దిగా
నెయ్యి- అర కప్పు
పాలు- 1 కప్పు

 

తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంప‌ల‌ను తొక్క తీసి తురుమి ప‌క్క‌ప పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పై పాన్ పెట్టుకొని, అందులో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మ‌రికొద్దిగా నెయ్యి వేసి..  బంగాళాదుంపల తరుగు వేసి వేయించుకోవాలి. ఈ తరుగును ఎంత ఎక్కువసేపు వేయిస్తే హల్వా అంత రుచిగా ఉంటుంది. తర్వాత పాలు, పంచదార పొడి వేసి కలపాలి.

 

చిక్కబడేవరకూ ఉడికించి చివర్లో బాదం, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి చల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా టేస్టీ టేస్టీ బంగాళాదుంప హ‌ల్వా రెడీ. సాయంత్రం లేదా మ‌ధ్యాహ్నం దీని తింటుంటే ఆ మ‌జానే వేరు. ఇక పెద్ద‌లు.. పిల్ల‌లు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సో.. మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

ఇక  బంగాళాదుంపలో ఉండే మంచి కార్బొహైడ్రేట్లు మీ శరీరానికి సరిపడా శక్తిని సమకూర్చడంలో ఎంతగానో సహాయం చేయగలదు. ఈ ఆహార ప్రణాళిక, బరువు తగ్గించడంలో సహాయపడడమే కాకుండా, రోజంతా శరీరం చురుకుగా ఉండేలా సహాయపడగలదని ఆహార నిపుణులు కూడా సూచిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: