కావాల్సిన ప‌దార్థాలు:
పాలకూర- ఒక క‌ట్ట‌
బోన్‌లెస్‌ చికెన్‌- ఒక‌కేజీ
నూనె- తగినంత
ఉప్పు- రుచికి సరిపడా

 

అల్లం- చిన్న‌ది
వెల్లుల్లి- నాలుగు రెబ్బ‌లు
పచ్చిమిర్చి- రెండు
జీలకర్రపొడి- ఆర‌ టీస్పూన్‌
ఉల్లిపాయ- ఒకటి

 

త‌యారీ విధానం:
ముందుగా పాలకూరను పావుగంట పాటు నీటిలో నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగాలి. మ‌రియు చికెన్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. అందులో ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత దీన్ని ఒక పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో పాలకూర వేసి, కొన్నినీళ్లు పోసి చిన్నమంటపై నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టాలి. 

 

అలాగే మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కాస్త మ‌గ్గాక అల్లం, వెల్లుల్లి, తగినంత ఉప్పు మ‌రియు కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేయాలి. కాసేపయ్యాక పాలకూర కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే.. నోరూరించే పాలకూర చికెన్‌ రెడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: