గరం గరం ఫ్రై చికెన్ ఎంత బాగుంటుందో తెలుసా ? ఈ చల్లటి చలి కాలంలో వేడి వేడి చికెన్ ఫ్రై తింటే ఉంటది.. ఆ రుచే వేరు. ఆ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ చికెన్ పకోడీ ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. ఎలా చేస్తే చికెన్ అదిరిపోతుందో.. ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకొండి. ఇంట్లో వారికీ చేసి తినిపించండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

చికెన్‌ - అరకిలో, 

 

కోడిగుడ్లు - రెండు, 

 

అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్‌, 

 

పిండి - పావు కప్పు, 

 

మిరియాల పొడి - కొద్దిగా, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

బ్రెడ్‌ ముక్కల పొడి - కొద్దిగా, 

 

నూనె - సరిపడా.

 

తయారీ విధానం... 

 

చికెన్‌ను శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో చికెన్‌ ముక్కలు తీసుకొని, కోడిగుడ్లు, అల్లంవెల్లుల్లి పేస్టు, పిండి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని గంటపాటు పక్కన పెట్టాలి. తరువాత చికెన్‌ ముక్కలకు బ్రెడ్‌ ముక్కల పొడి అంటిస్తూ పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అందులో చికెన్‌ ముక్కలు వేయాలి. చిన్నమంటపై అవి గోధుమ రంగులోకి మారే వరకు ఫ్రై చేయాలి. వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: