చికెన్ అంటే ఎవరికన్న నోరు ఉరిపోవాల్సిందే... అందులోను నాన్ వెజ్... కొంతమంది కి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు..."కిచెన్" లో "చికెన్" లేకపోతే ఏలా?? అసలే నాన్ వెజ్.. చూస్తే ఒక పట్టు పట్టు పట్టాలిసిందే కదా..


ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా...


కావాల్సిన పదార్దాలు :

 


చికెన్ -1 కేజీ
వేరుశెనగ నూనె - 100 గ్రామ్స్
అల్లం వెల్లులి పేస్ట్ -సరిపడా
ఉల్లిపాయలు - 2 పెద్దవి
పచ్చిమిరపకాయలు -4
దానియల పొడి -టీ స్పూన్
జీలకర్ర పొడి -టీ స్పూన్
ఎండుకొబ్బరి - చిన్న ముక్క
గస గసాలు - 2 టేబుల్ స్పూన్స్
లవంగాయాలు -4
దాల్చినచెక్క - సరిపడా
పసుపు - చిటికెడు
కారం - 2 -1/2 టేబుల్ స్పూన్స్
ఉప్పు -3 టేబుల్ స్పూన్స్
టమోటోలు -2 పెద్దవి (ఆప్షనల్ ).
కొత్తిమీర -4 రెబ్బలు..
కావలిసిన పదార్దాలు చూసారు కదా.....

ఇప్పుడు తయారీ విధానం ఎలానో చూద్దామా !!!


ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా మెత్తగా ఒక పేస్ట్ లాగా వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి చికెన్ ముక్కలను తీసుకుని శుభ్రమైన నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చికెన్ ముక్కలకు ఉప్పు, కారం కొంచెం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడతాయి...

 

తర్వాత మిక్సీ జార్లో కి గసగసాలు, ఎండుకొబ్బరి, ధనియాలు, లవంగాయాలు, దాల్చిన చెక్క వేసి చక్కగా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి.. ఇపుడు స్టవ్ వెలింగించి పాన్ పెట్టి అందులో నూనె పోయాలి.. నూనె వేడెక్కాక పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి... అవి వేగాక కొంచెం అల్లం వెల్లులి పేస్ట్ వేయాలి.. అల్లం పేస్ట్ బాగా వేగాలి లేదంటే పచ్చి వాసన వస్తుంది.. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు వేయాలి.. టమోటో వేస్తే కూర రుచి బాగుంటుంది...

 

కొంతమంది కి టమోటో నచ్చదు.. అలాంటప్పుడు వేయకపోయినా పర్వాలేదు. అన్ని వేగాక ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి గరిటె తో తిప్పి మూత పెట్టాలి...మంట హై లోనే ఉంచాలి.. ఎందుకంటే చికెన్ లో ఉన్న నీరు అంతా ఆవిరి అయిపోతాయి.. 5 నిముషాలు అయ్యాక తిప్పాలి నీరు అంతా పోయి నూనె పైకి కనబడుతుంది.. ఇపుడు మళ్ళా కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి.. కొంచం సేపు అయ్యాక 2 గ్లాసులా నీరు పోయాలి..

 

తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గసగసాల పేస్ట్ వేసి తిప్పి మూత పెట్టాలి... మంట ఎక్కువగానే ఉంచాలి..10 నిముషాలు ఉడకనివ్వాలి.. గసగసాలు, కొబ్బరి వేయడం వల్ల కూర చిక్కుపడి రుచి బాగుంటుంది.. వాసన కూడా ఘుమాయిస్తుంది... 10 నిముషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేయాలి...అంతే ఎంతో రుచికరమయినా, చికెన్ కర్రీ రెడీ... వెంటనే మీరు కూడా తయారు చేయండి.. చప్పబడిన నాలుకకి మీ రుచి ని చూపించండి....


మరింత సమాచారం తెలుసుకోండి: