కావాల్సిన ప‌దార్థాలు:
కాలీఫ్లవర్‌- ఒక‌టి
కారం- రెండు టేబుల్ స్పూన్లు
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- టేబుల్‌స్పూను
మొక్కజొన్న పిండి- నాలుగు టేబుల్‌స్పూన్లు

 

పెరుగు- రెండు టేబుల్‌స్పూన్లు
వంటసోడా- చిటికెడు
ఉప్పు- రుచికి సరిపడ
కరివేపాకు- కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా కాలీఫ్లవర్‌ను విడదీసి మరుగుతున్న నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మొక్కజొన్న పిండి, పెరుగు, వంటసోడా, కారం,ఉప్పు,  అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి అందులో కాలీఫ్లవర్‌ ముక్కలు కూడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. 

 

ఆ త‌ర్వాత మందపాటి గిన్నె తీసుకొని తగినంత నూనె వేసి ముక్కలన్నీ అన్నీ ఒకేసారి లేదా కొన్నికొన్ని చొప్పున నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా టేస్టీ టేస్టీ కాలీ ఫ్ల‌వ‌ర్ 65 రెడీ అయిన‌ట్టే. వీటిని మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నాక్స్‌ కింద తింటే చాలా బాగుంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: