రాజ్యాంగ గ్రామంలో పురుషులు మహిళలు కలిసి ఉంటారు కానీ అసలు పురుషులే లేని కొన్ని గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలలో కేవలం మహిళలు మాత్రమే నివసిస్తున్నారు. వాటి వెనుక వేరువేరు కథనాలు కథలు ప్రచారంలో ఉన్నాయి. పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు పురుషులతో సంబంధం లేకుండా జీవించే గ్రామాల గురించి రకరకాల వార్తలు ఇటీవల బయట పడుతున్నాయి. కెన్యా దేశం లో కొమజాక్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో కేవలం మహిళలు మాత్రమే జీవిస్తారు. సమాజం చేత అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని చిన్న వయసులోనే మరియు పెళ్లయిన తర్వాత మగజాతి నుండి వేధింపులకు గురైన కొంతమంది ఆడవాళ్లు గుంపు 1990లో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చిన్నపాటి సంఖ్యతో మొదలైన ఈ గ్రామం ఇప్పుడు వేల సంఖ్యకి చేరింది.

 

అంతేకాకుండా గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు వాళ్లకి ఒక మహిళా అధ్యక్షురాలు అని కూడా ఉంటుంది. పురుషులు ఎవరూ రాకుండా ఆ గ్రామం చుట్టు కొంతమంది మహిళలు కాపలా కాస్తుంటారు. పండ్లు తేనె మరియు ఇతర వస్తువులను అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు. అంతేకాకుండా ఇళ్లను మట్టి తో నిర్మించుకుంటారు. అయితే ఈ గ్రామంలో ఉన్న ఆడవాళ్లకు ప్రపంచంలో ప్రముఖ మహిళలు కొంతమంది ఆర్థికపరమైన సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారు. ప్రపంచ నలుమూలల నుండి దాతల రూపంలో వచ్చే డబ్బు పనిచేయలేని మరియు ఆడ వృద్ధులకు ఆ డబ్బును ఖర్చు పెడతారు.

 

ఇక్కడ వివాహ పద్ధతి ఎలా ఉంటుందంటే సోలోగామిక్ లో వివాహాలు చేసుకుంటారు సోలోగామి అంటే తనని తాను మనువాడడం.  ఈ విధానం ద్వారా మహిళలు పెళ్లిళ్లు చేసుకుని పురుష సమాజం పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కఠినంగా ఈ గ్రామంలో ఉండే మహిళలు ఉండేచోట ఏ మగవాడు ఐనా ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తే కాపలాగా ఉన్న మహిళలతో పాటు గ్రామంలో ఉన్న మహిళలు అంతా ఏకమయి సదరు మగ వాడిని పరిగెత్తించి పరిగెత్తించి మరి దాడులు చేస్తారట. అంతగా ఈ గ్రామంలో ఉన్న మహిళలు మగ జాతిపై విసిగిపోయారు అట. 

మరింత సమాచారం తెలుసుకోండి: