ఉగ్గాని.. ఇది రాయలసీమలో ఎంతోమంది ఆహార ప్రియులకు ఇష్టమైన టిఫిన్. ఈ టిఫిన్ కోసం ఎంతోమంది ఎగబడతారు. ఒక్కసారి రాయలసీమ నుండి బయటకు వస్తే ఈ టిఫిన్ ఎక్కడ వెతికిన దొరకదు.. అంత రేర్ టిఫిన్. అయితే ఈ టిఫిన్ ఇంత బాగున్నా సరే ఈ టిఫిన్ వల్ల ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే.. గ్యాస్ ట్రబుల్ అబ్బా... ఈ సమస్య తగ్గుతుంది లెండి.. ఒక్క టాబ్లెట్ వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అయితే ఈ టిఫిన్ ఎలా చేసుకుంటారు? అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  


  
కావాల్సిన పదార్ధాలు... 

 

200 గ్రా. బొరుగులు

 

1 బంగాళదుంప 

 

1 క్యారెట్

 

1 ఉల్లిపాయ

 

4 పచ్చిమిర్చి

 

తగినంత టమాట

 

4 స్పూన్లు చింతపండు గుజ్జు

 

1 స్పూన్ జీలకర్ర

 

1 స్పూన్ ఆవాలు

 

3 టేబుల్ స్పూన్లు పల్లీలు


 
తయారీ విధానం.. 

 

ముందుగా బొరుగులు నీళ్ళలో 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిలో ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర, పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అందులో ఉల్లిముక్కల్ని దోరగా వేయించి, క్యారెట్, ఆలూ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జువేసి కలిపి అందులో బొరిగులు కూడా వేసి బాగా కలిపి దించాలి. అంతే రుచికరమైన ఉగ్గాని రెడీ. ఈ ఉగ్గాని ఎంత తిన్న తక్కువగానే ఉంటుంది. అందుకే ఈ ఉగ్గాణిని తక్కువగా తినండి. ఉదయం పూట తింటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: