కావాల్సిన ప‌దార్థాలు:
మటన్‌- అర కిలో
పసుపు - ఒక టీ స్పూను
ఉల్లిపాయ- ఒకటి

 

నూనె- ఒక టేబుల్‌ స్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూను
గరం మసాలా- ఒక టీ స్పూను
గోంగూర- రెండు కట్టలు

 

పచ్చిమిర్చి- ఆరు
కారం- రెండు టీ స్పూన్లు
ధనియాల పొడి- ఒక టీ స్పూను
జీలకర పొడి- అర టీ స్పూను
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

తయారీ విధానం:
ముందుగా మ‌ట‌న్‌ను శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి. త‌ర్వాత కుక్క‌ర్ తీసుకొని అందులో మ‌ట‌న్‌, ధనియాల పొడి, కారం,  జీలకర పొడి, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి.  ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకొని నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయలు, గరం మసాలా వేసి ఒక నిమిషం సేపు వేగించాలి. 

 

తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత ఉడికిన మటన్‌, తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా నోరూరించే గోంగూర మ‌ట‌న్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: