న్యూ ఇయర్.. ఎన్నో సంతోషాలు ఇచ్చిన ఈ 2019 సంవత్సరానికి బై బై చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఎన్నో సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి ఈ న్యూ ఇయర్ రోజు ఎంతో స్పెషల్ కనుక ప్రతి ఏటా కేక్ కట్ చేస్తాం. ఈసారి కూడా కేక్ కట్ చేద్దాం. కానీ ఈసారి బయట కొన్నది కాదు.. ఇంట్లోనే కేక్ తయారు చేద్దాం. అదికూడా హనీ కేక్. 

 

కావలసిన పదార్థాలు... 

 

మైదా- ఒక కప్పు, 

 

చక్కెర పొడి- ఒక కప్పు, 

 

వెన్న లేదా నెయ్యి- 100 గ్రా., 

 

సోడా- అర టీ స్పూను, 

 

గుడ్లు- 2, 

 

పాలు- 3 టేబుల్‌ స్పూన్లు, 

 

వెనీలా ఎసెన్స్‌- అర టేబుల్‌ స్పూను, 

 

తేనె- అర కప్పు, 

 

చక్కెర- 3 టేబుల్‌ స్పూన్లు, 

 

జామ్‌- 5 టేబుల్‌ స్పూన్లు, 

 

పచ్చికొబ్బరి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు.

 

తయారీ విధానం... 

 

మైదా, చక్కెర పొడి, తినే సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను బాగా గిలక్కొట్టుకుని ఓవెన్‌లో బేక్‌ చేయాలి లేదా కుక్కర్‌లో ఆరు విజిల్స్‌ వచ్చే దాకా ఉంచాలి. తర్వాత బయటికి తీసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో తేనె, ఒక టేబుల్‌ స్పూను చక్కెర, అర కప్పు నీళ్లు పోసి కలుపుకుని కేక్‌ మీద సమానంగా పరవాలి. మిగిలిన చక్కెర జామ్‌లో వేసి చిన్న మంట మీద రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత కేక్‌ మీద సమానంగా రాసి, చివరగా కొబ్బరి తురుమును పైన చల్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: