కావాల్సిన ప‌దార్థాలు:
పెసరపప్పు- రెండు కప్పులు
పచ్చికొబ్బరి తురుము- ఒక క‌ప్పు
పచ్చిమిర్చి- నాలుగు

 

ఆవాలు- అర టీ స్పూన్‌
జీలకర- అర టీ స్పూన్‌
పసుపు- చిటికెడు
ఉప్పు- రుచికి సరిపడా

 

మంచినీళ్లు- స‌రిప‌డా
ఉల్లిపాయలు- రెండు
నూనె- త‌గినంత‌
కొత్తిమీర‌- కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. ఆ తరువాత స్టౌ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి, మంచినీళ్లు పోసి ఉడికించాలి.

 

స‌రిప‌డా ఉడికిన త‌ర్వాత‌ తగినంత ఉప్పు వేసి బాగా క‌లిపి మ‌రో ప‌ది నిమిషాలు ఉడ‌క‌నివ్వాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర కూడా వేసి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా ఆరోగ్య‌క‌ర‌మైన‌.. రుచిక‌ర‌మైన కొబ్బ‌రి ప‌ప్పు రెడీ. దీన్ని వేడి వేడి రైస్‌తో తింటే చాలా బాగుంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: