ముందే ఇది చలికాలం. ఈ కాలంలో ఎంత వేడి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే అలా వేడి వేడిగా తినాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. అది ఏంటంటే.. వెజిటబుల్‌ సూప్..  వెజిటబుల్‌ సూప్‌ అనే కాదు.. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ సూప్ అయినా సరే ఈ చలికాలంలో తీసుకుంటే అదిరిపోతుంది. అయితే ప్రస్తుతం వెజిటబుల్‌ సూప్‌ ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుందాం.

  

కావలసిన పదార్థాలు.. 

 

అల్లం - చిన్నముక్క, 

 

వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, 

 

పచ్చిమిర్చి - ఒకటి, 

 

కొత్తిమీర - కొద్దిగా, 

 

బీన్స్‌ - నాలుగైదు, 

 

క్యారెట్‌లు - రెండు, 

 

క్యాప్సికం - ఒకటి, 

 

పుట్టగొడుగులు - మూడు, 

 

ఉల్లికాడలు - రెండు, 

 

మిరియాలు - ఒక టీస్పూన్‌, 

 

సోయా సాస్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, 

 

మొక్కజొన్న పిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె - సరిపడా.

 

తయారీ విధానం... 

 

కూరగాయలను శుభ్రంగా నీటితో కడగాలి. పాన్‌లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత కట్‌ చేసిన బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, మిరియాలు, కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. సోయాసాస్‌ వేసి కొన్ని నీళ్లు పోసి మరికాసేపు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో మొక్కజొన్న పిండి వేసి కలపాలి. సన్నగా తరిగిన ఉల్లి కాడలతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి. చలికాలం ఈ వెజిటబ్‌లో సూప్‌ ఎంతో బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: