పులిహోర.. మీరు అనుకున్నది కాదు.. గుడిలో మనకు ప్రసాదంగా పెట్టె పులిహోర. ఈ పులిహోర ఎంత తిన్న ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది.. ఇంట్లో పులిహోర చేసినప్పటికీ దేవుడి దగ్గర పెట్టె పులిహోర అంత రుచి ఉండదు. అందుకే పులిహోర దేవుడు ప్రసాదం అంటే ఎంతో మంది ఇష్టంగా తింటారు. అయితే ఈ పులిహోర ఎలా చేస్తే అంత బాగుంటుంది.. ఎలా కలిపితే బాగుంటుంది అనేది ఇక్కడా చదివి తెలుసుకోండి. ఇంట్లోనే చేసుకొని తినండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

బియ్యం - ఒకకప్పు, 

 

పసుపు - అర టీస్పూన్‌, 

 

నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, 

 

ఆవాలు - ఒక టీస్పూన్‌, 

 

సెనగపప్పు - ఒక టీస్పూన్‌, 

 

మినప్పప్పు - ఒక టీస్పూన్‌, 

 

పచ్చిమిర్చి - మూడు, 

 

ఎండుమిర్చి - మూడు, 

 

నూనె - ఐదు టీస్పూన్లు, 

 

కరివేపాకు - కొద్దిగా, 

 

ఉప్పు - తగినంత, 

 

వేరుసెనగలు - ఒక టీస్పూన్‌.

 

తయారీ విధానం.. 

 

ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగ వేసి వేగించాలి. తరువాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి, పసుపు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు అన్నం వేసి, నిమ్మరసం పోసి సమంగా కలిసేలా కలపాలి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి ఈ పులిహోరని మళ్ళి బాగా కలపాలి.  అంతే పుల్ల పుల్ల పులిహోర రెడీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: