కావాల్సిన ప‌దార్థాలు:
బంగాళదుంపలు- పావు కిలో
చింతపండు- ఇరువై గ్రాములు
పసుపు- ఒక టీ స్పూన్

 

ఇంగువ- చిటికెడు
ఆవపిండి- అర క‌ప్పు
కారం- అర క‌ప్పు

 

ఉప్పు- అర క‌ప్పు
నూనె- పావుకిలో
మెంతిపిండి- అర టీ స్పూను

 

త‌యారీ విధానం:
ముందుగా బంగాళ దుంపల్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కనపెట్టుకోవాలి. తరువాత చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సగం నూనెని కాచి అందులో ఇంగువా వేయాలి. ఆ త‌ర్వాత‌ ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి కలిపి బంగాళాదుంప ముక్కల్ని, చింతగుజ్జుని వేసి ఇంగువ వేసిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. 

 

దీన్ని ఒక గాజుసీసాలో పెట్టి మిగిలిన నూనెని సీసాలో పోసేయ్యాలి. మూడవ రోజున తీసి బాగా క‌లిపి వేడి వేడి రైస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాల‌నుకుంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవ‌చ్చు. ఇక ఈ సీజ‌న్‌లో ఇలాంటి ఊరగాయలు తింటే శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు స‌రిప‌డా ఉంటుంది. అలా అని ప‌రిమితికి మించి మాత్రం తీసుకోకూడ‌దు. అలాగే బంగాళదుంపల ఆవకాయ కూడా నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: