కావాల్సిన ప‌దార్థాలు:
ఉసిరికాయలు- ఒక కప్పు
ధనియాల పొడి- ఒక టీస్పూన్‌
కారం- ఒక టీస్పూన్‌
నెయ్యి- ఒక టేబుల్‌స్పూన్‌

 

ఉప్పు- రుచికి తగినంత
నూనె- ఒక టేబుల్‌స్పూన్‌
సోంపు- ఒక టేబుల్‌స్పూన్‌

 


త‌యారీ విధానం:
ముందుగా ఉసిరికాయ‌ల‌ను ఉడికించి, గింజలు తీసేసి ముక్కలు చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టౌ మీద‌ పాన్ పెట్టి అందులో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సోంపు వేసి వేగించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక‌ ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. 

 

ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. ఇది చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకుంటే స‌రిపోతుంది. కావాల‌నుకంటే తాలింపు కూడా పెట్టుకోవ‌చ్చు. అంతే ఎంతో సులువైన.. రుచిక‌ర‌మైన ఉసిరికాయ చట్నీ రెడీ.. దీన్ని వేడి వేడి రైస్‌లో గానీ.. టిఫెన్‌లోని తింటే చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: