ఎక్కడోచోట, ఎదో ఒకరూపంలో ఆడవాళ్ళపై హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇటీవల ‘దిశ’ హత్యాచారం సంచలనం రేపడంతో ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరిగింది.. చాలా మంది ప్రముఖులు సైతం దిశ హత్యాచారంపై స్పందించారు.. అపుడు అమితాబచ్చన్ చేసిన వ్యాఖ్యలు కొంచెం దుమారమే రేపాయి."రేప్ చేసేటప్పుడు తప్పించుకోలేం. కాబట్టి వెనక్కి పడుకుని ఆనందించండి'’ ఇంతటి దారుణమైన మాటను కొన్నేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ అన్నట్లు ఓ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. 

 

అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ బాలీవుడ్ నటి బిదితా బాగ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒంటినిండా రక్తంతో, చిరిగిపోయిన దుస్తులతో, గాయాలతో.. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ షాకింగ్ ఫొటోలను బిదిత ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేశారు.హీరోయిన్ అంటే అందంగా రెడీ అయ్యి, మంచి బట్టలు వేసుకుని ఫోటో షూట్ ఇస్తుంది. కాని దీనికి భిన్నంగా బాలీవుడ్ నటి బిదితా బాగ్ ఫోటో షూట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు...



‘‘అనుమతా? నీ అనుమతి ఎవడికి కావాలి. నేను అనుకున్నదే చేస్తాను. నేను ఏడ్చాను, వద్దని వేడుకున్నాను. అత్యాచారం నుంచి తప్పించుకోలేం అన్నప్పుడు వెనక్కి పడుకుని దాన్ని ఎంజాయ్ చేయడమే అన్నాడు. నా దుస్తులు చింపేస్తూ, నా మానాన్ని లాగేసుకున్నాడు. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉన్న నన్ను నేనే దగ్గరికి తీసుకుని ఓదార్చుకున్నాను. ఇప్పుడు నాది ఆత్మ లేని శరీరం మాత్రమే నేను మహిళను.

 

వోగ్ మ్యాగజైన్‌లో ఇలాంటి ఫొటోలు ప్రచురితమయ్యే లోపు మహిళలు అంటే ఏంటో, వారి ఆశలేంటో మగాళ్లకు తెలియజేయాలి’ అని క్యాప్షన్ ఇచ్చారు బిదితా బాగ్.. ఆడవాళ్ళ పై జరిగే లైంగిక వేధింపులను ఖండిస్తూ, ఆడవాళ్ళ బాధ ఏంటి అనేది అందరికి అర్ధమవ్వాలి అని ఇలాంటి ప్రయత్నం చేసారు... ఇప్పటివరకు అందరు ఇలాంటి సంఘటనలను ఖండిస్తూ వ్యాఖ్యలు మాత్రమే చేసారు.. కాని తొలిసారిగా బిదితా మాత్రమే ఇలాంటి ఫోటో షూట్లో పాల్గొంది... నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ నటి చేసిన ప్రయత్నానికి.

 

రేప్ చాలా తప్పు. మన చుట్టు పక్కల ఉన్నవారిని రేప్ అనేది చాలా పెద్ద నేరమని తెలియజేయాలి. ప్రపంచంలోని ప్రతీ మహిళకి నో చెప్పే హక్కు పుట్టుకతోనే ఉంది. అవసరం వచ్చినప్పుడ్లా మమ్మల్ని వాడుకుని పడేయడానికి మేము యంత్రాలం కాదు. మేమూ మనుషులమే’’ అని తెలిపారు బాలీవుడ్ నటి.  

మరింత సమాచారం తెలుసుకోండి: