కావాల్సిన ప‌దార్థాలు:
మీల్‌మేకర్‌- వంద గ్రాములు
గోంగూర - రెండు కట్టలు
పసుపు- చిటికెడు
నూనె- ఒక‌టేబుల్‌ స్పూను

 

వేగించిన నువ్వుల పొడి- అరకప్పు
ఉప్పు- రుచికి తగినంత
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- నాలుగు

 

ఎండుమిర్చి- రెండు
వెల్లుల్లి- ఐదు దెబ్బ‌లు
జీలకర్ర- అర టీ స్పూను
కారం - ఒక‌ టీస్పూను

 

తయారీ విధానం:
ముందుగా గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మీల్‌మేకర్‌ని ప‌ది నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కన పెట్టుకోవాలి. త‌ర్వాత స్టౌ మీద పాన్ పెట్టుకొని నూనె వేయాలి. నూనె వేడెక్కేక‌ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేగించి మీల్‌మేకర్, నువ్వుల పొడి కూడా వేసి కాస్త మ‌గ్గ‌నివ్వాలి.

 

ఐదు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన గోంగూర వేసి మూతపెట్టాలి. ఒక ప‌ది నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టి మగ్గించి స్టై ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే నోరూరించే  గోంగూర మీల్మేక‌ర్ రెడీ.. దీన్ని వేడి వేడి రైస్‌తో తింటే చాలా బాగుంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: