సండే  వచ్చింది అంటే ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. మాములుగా ఇంట్లో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ అలాంటిది ఆదివారాలు వస్తే ఇంకా ఊరికే ఉంటారా ? అయితే రేపు సండే కాబట్టి స్పెషల్ గా ఇంట్లో ఎగ్ బఠానీ కర్రీ వండి పెట్టండి.. అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ ఎగ్ బఠానీ కర్రీ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకొండి.. 

 

కావలసిన పదార్థాలు... 

 

గుడ్లు -4, 

 

టమోటాలు - 3, 

 

ఉల్లిపాయ తరుగు - అరకప్పు, 

 

పచ్చిబఠాణి - పావుకప్పు, 

 

లవంగాలు -4, 

 

దాల్చినచెక్క - అరంగుళం ముక్కలు 2, 

 

ధనియాల పొడి -అర టీ స్పూను, 

 

గరంమసాల - అర టీ స్పూను, 

 

పసుపు -పావు టీ స్పూను, 

 

కారం - 1 టీ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

కొత్తిమీర - 1 కట్ట, 

 

అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను.

 

తయారీ విధానం... 

 

టమోటాల్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి లవంగాలు, దాల్చినచెక్క, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేగించి పసుపు, టమోటా ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాలపొడి, మసాలపొడి, పచ్చిబఠాణి వేసి మూతపెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. బఠాణి మెత్తబడ్డాక గుడ్లని పగలకొట్టి వేయాలి. గరిటతో కలబెట్టకుండా మూతపెట్టి సన్నని సెగ మీద 10 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. అన్నం లేదా చెపాతీలతో తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: