అమ్మ అను మాటకు అర్దాలే వేరు.. తల్లిని మించిన దైవం లేదు.. అలాగే తల్లి బిడ్డ పై చూపే ప్రేమ చెప్పలేనిది.. నవమాసాలు మోసి కని మనల్ని కంటికి రెప్పలా కాపాడే కనిపించే దైవం అమ్మ... మనుషుల్లో మాత్రమే అమ్మ ప్రేమ ఉంటుంది అనుకుంటే దానంత పిచ్చితనం మరొకటి లేదు.. జంతువుల్లో కూడా అమ్మ ప్రేమ మాటల్లో చెప్పలేనిది.., తలకు తీవ్ర గాయమై రక్తం దారలా కారుతున్నా ఓ వానరం తన తల్లి ప్రేమను చాటుకుంది.

 

ఆకలితో ఉన్న తన బిడ్డకు స్తన్యం అందించి చనుబాలు పట్టింది. బిడ్డ ఆకలి తీర్చడం కోసం రక్తం కారుతున్న లెక్కచేయలేదు..హైవేలో నర్సాపూర్ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కోతులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.ఆహారందొరకక చాలా ఇబ్బందులు పడతాయ్ అందుకే అవి రోడ్లకు ఇరువైపుల కూర్చొని ఆహారం కోసం చూస్తుంటాయి.

 

ఆ ప్రాంతంలో ఆహారం దొరక్క అలమటించడం, ఆ మార్గంలో ప్రయాణించే పలువురు వాటికి తరచూ ఆహారాన్ని అందించటం అందుక్కారణం.దారిన పోయే వాళ్ళు అక్కడున్న కోతులకి ఎదో ఒక ఆహారం వేస్తూ ఉంటారు.. వాటి కడుపులో నింపుతూ ఉంటారు.
నర్సాపూర్ సమీపంలోని గుమ్మడిదల గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఆహారం కోసం చూస్తున్న ఓ కోతి ప్రమాదానికి గురైంది. వాహనదారులు అందించిన ఆహారాన్ని తీసుకునే క్రమంలో ఆ వానరం రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

 

దీంతో తలకు తీవ్ర గాయమై రక్తం దారలా కారుతోంది.. ఎంత రక్తం ధారలా కారుతున్న లెక్కచేయకుండా తన బిడ్డ కి పాలు ఇచ్చి ఆకలి తీర్చింది... ఇది చుసిన కొంతమంది చలించిపోయారు.. ఒక్కసారిగా అమ్మ ప్రేమని గుర్తుచేసుకున్నారు...

 

కొంత మంది వాహనదారులు ఆ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. రక్తపు మడుగులో తల్లి వానరం తన బిడ్డకు పాలిచ్చిన దృశ్యం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.... పాపం ఇపుడు ఈ కోతి పరిస్థితి ఇలా ఉందో ఏమో...

మరింత సమాచారం తెలుసుకోండి: