గర్భం త్వరగా రావాలంటే సరైన రోజులలో ర‌తిలో పాల్గొనాలి. అంతేకాక‌ సరైన భంగిమలు కూడా ఆచరించాలి. పిల్లలు పుట్టాలని కోరుకునే వారికి కొన్ని రతి భంగిమలు అద్భుత ఫలితాలనిస్తాయి. యోని లోపల లోతుగా వీర్యకణాలను వదిలే భంగిమలు రతిలో ఉపయోగిస్తే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ‌గా వుంటాయని వైద్య నిపుణులు భావిస్తారు.

 

సాధారణంగా రతి భంగిమలలో అనాదిగా వస్తున్న మిషనరీ భంగిమను వీరు పిల్లలు త్వరగా పుట్టటానికి సిఫార్సు చేస్తారు. మిష‌న‌రీ భంగిమ అన్న‌గా స్గ్రీ కింద ప‌డుకోవ‌డం పురుషుడు ఆమె పైన ప‌డుకోవ‌డం.  దీనికి కారణం మిషనరీ సెక్స్ భంగిమలో అంగం యోనిలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. కనుక వీర్యకణాలు గర్భం ముఖ ద్వారం వద్ద విడుదల అవుతాయి. అంతేకాక, మిషనరీ భంగిమలో మహిళ కింద పడుకోవటం ఆమె పై పురుషుడు కూర్చొని లేదా పడుకొని వుండటం చేత అతని వీర్యకణాలు బయటకు లీక్ అయ్యే సమస్య కూడా వుండదు. అతను విడుదల చేసిన వీర్యకణాలు ఎక్కువ దూరం కూడా ప్రయాణించనవసరం లేదు. వీర్యం సరిగ్గా యోని దాటి గర్భం ప్రవేశంలో పడిపోవటంతో అండంతో కలిసి సంయోగం చెందే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి. 


ఆ త‌ర్వాత భంగిమ‌ డాగీ స్టైల్ ఆచరించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన చేతులు నేలకానించి కాళ్ళ పై నిలబడుతుంది. లేదా బోర్లా పడుకుంటుంది. పురుషుడు వెనుక నుండి ఆమె యోనిలోకి అంగప్రవేశం చేసి సరిగ్గా వీర్యాన్ని ఆమె గర్భం ప్రవేశంలో పడేట్లు చేస్తాడు. దీనినే డాగీ స్టైల్ అంటారు. అంటే కుక్కల సంపర్కం వంటిది. ఇది కొద్దిపాటి అసౌకర్యం వున్నప్పటికి ఫలితం అధికంగా వుంటుంది. 

 

సాధారణంగా వీర్యకణాలు విడుదల సమయంలో బయటకు పోయే భంగిమలు చెప్పాలంటే, స్త్రీ, పురుషులు నిలబడి చేసినా లేదా కూర్చుని లేదా మహిళ పై నుండి పురుషుడు కింద పడుకుని చేసినా వీర్యం గర్భం లోకి ప్రవేశించక, గర్భం విఫలమయ్యే అవకాశాలు అధికంగా వుంటాయి. వాస్తవానికి వైద్యులు, రతి సమయంలో మహిళ పిరుదుల కింద చిన్నపాటి తలగడను వుంచి, రతి ఆచరిస్తే, అంగం నుండి విడుదల అయ్యే వీర్యం బయటకు పోకుండా లేదా తక్కువ దూరంగా ప్రయాణించి గర్భం ప్రవేశంలో పడే అవకాశముంటుందని సూచిస్తారు. ఇలా దిండు పెట్టుకుని ర‌తి చేయ‌డం వ‌ల్ల అంగం యోనిలోకి స‌రాస‌రి వెళ్లి గ‌ర్భ విఫ‌ల అవ‌కాశాల‌ను త‌గ్గిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: