టైటిల్ చూడగానే నోరు ఊరిపోయింది కదా .. నిజమే.. ఈ కాంబినేషన్ ఆహా ఆనేలాగే ఉంటుది.. అంత అద్భుతమైన చెపాతి ఎగ్ కర్రీ ఇంట్లో అమ్మ చేసినప్పుడు ఆనందంగా తిని ఉంటాము. అయితే ఎలా చేసుకోవాలో ఈ తరం యువతకు చాలామందికి తెలియదు.. అలాంటివారంతా ఇక్కడ చదివి ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. అద్భుతమైన ఎగ్ చపాతీ కర్రీ తినండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

గోధుమ పిండి- 2 కప్పులు, 

 

గుడ్లు-4, కారం-25గ్రా, 

 

ఉల్లిపాయాలు- సన్నగా తరిగినవి అరకప్పు, 

 

కొత్తిమీర- సన్నగా తరిగింది అరకప్పు, 

 

పచ్చి మిరపకాయాలు- సన్నగా తరిగినవి4, 

 

ఉప్పు- చిటికెడు, 

 

నూనె- 2 చెంచాలు. 

 

తయారీ విధానం.. 

 

ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత చపాతీలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని అందులో ఒక గుడ్డును పగులగొట్టి అందులో పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, ఉల్లిపాయాల తురుము, ఉప్పు చిటికెడు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెనంపై ఆమ్లెట్‌ వేయాలి. ఆమ్లెట్‌ వేగుతుండగా ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని దానిపై వేసి కొద్దిగా నొక్కాలి. తర్వాత సన్నని మంటపై ఆమ్లెట్‌ని రెండు వైపులా తిప్పుతూ దోరగా కాల్చాలి. దీంతో ఎగ్‌చపాతీలు రెడీ. ఈ రెడీ అయిన ఎగ్ చపాతీలను ముక్కలుగా కట్‌చేసుకుని టమోటా సాస్‌లో తింటే ఆహా ఏమి రుచి అని అనాలనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: