ప్రస్తుత కాలంలో పిల్లల పై సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతగానో ఉంది. ఈ ప్రభావం పై ఎప్పటి నుంచో పరిష్కార మార్గం కొరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ, వాటికీ  పరిష్కార మార్గాలు మాత్రం కనిపెట్టలేక పోతున్నారు. వక్రమార్గం పడుతున్న తమ పిల్లలను తల్లిదండ్రులు కూడా కనిపెట్టడంలో విఫలం చెందుతున్నారు. దీని ఫలితంగానే ఎన్నో గోరాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చేసిన వారికీ ఎలాంటి శిక్షలు వేసిన మల్లి మల్లి అవే ఘటనలు పునరావృతం అవుతున్నాయి. 


ఈ ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఘోరాలకు పాల్పడిన వారికీ ఎలాంటి శిక్షలు పడకపోవడంతో.. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మరో ఘోర ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని రాయగడ జిల్లా కె.సింగ్‌ పూర్‌ సమితి పరిధిలో ఓ మైనర్ బాలిక పై ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఓ బాలిక (12) వీధిలో మిగతా వారితో ఆడుకుంటోంది. బాలికను గమనించిన అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు అక్కడికి వచ్చారు. ఆ బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. తర్వాత బాలికను గ్రామంలోకి తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఈ దుశ్చర్యతో భయాందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని బాలిక తల్లి దండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆదివారం పోలీసులకు ఈ ఘటన పై ఫిర్యాదు చేశారు.


దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను విచారించారు. తర్వాత ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి పరీక్షలు నిర్వహించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: