కావాల్సిన ప‌దార్థాలు:
ఆకాకర కాయలు- పావు కిలో  
పసుపు- చిటికెడు
పాలు- ఒక‌టి టేబుల్‌ స్పూను

 

అల్లం వెల్లుల్లి పేస్ట్‌- అర టీ స్పూను
ఉల్లిపాయలు- మూడు
పచ్చిమిర్చి- నాలుగు

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
కారం- అర టీ స్పూను
జీలకర్ర- అర టీ స్పూన్‌

 

కరివేపాకు- కొద్దిగా
నూనె- తగినంత
శనగపప్పు- ఒక టీ స్పూన్‌

 

మినప్పప్పు- ఒక టీ స్పూన్‌
ఆవాలు- అర టీ స్పూన్‌
కొత్తిమీర- కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా ఆకాకర కాయల్ని తొక్క తీయకుండా తొడిమలు మాత్రమే తొలగించి గింజలతో పాటు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేగించి ఆకాకర ముక్కలు, పసుపు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి సన్నమంటపైన మగ్గనివ్వాలి. 

 

ముక్కలు సగం ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేయాలి. కాస్త స‌మ‌యం తర్వాత పాలు కూడా పోసి నీరంతా ఇగిరే వ‌ర‌కు ఉడ‌క‌నివ్వాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర చ‌ల్లుకుని స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ ఆకాక‌ర‌కాయ కూర రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: