పేద వాళ్ళుగా పుడితే అన్నిటికి తల వంచాలి అని ఈ రోజుల్లో జరుగుతుంది. ఇక బడా బాబులు చేతుల్లో జీవితాలు..నలిగిపోతున్నాయి.. అయితే ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు జీవితాలు అలానే కష్టపడుతున్నారు.. అసలు విషయానికొస్తే.. నిరుపేద కుటుంబానికి ఇచ్చిన అప్పును అడ్డం పెట్టుకుని.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడా దుర్మార్గుడు. అప్పు తీర్చడానికి దారి చూపిస్తానని నమ్మించి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

 

ఈవిషయం బయటకు చెబితే తండ్రిని చంపేస్తామంటూ బెదిరించి స్నేహితులతోనూ రేప్ చేయించాడు. అక్కడితో ఆ కిరాతకుడి పైశాచికత్వం ఆగలేదు. ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించి.. డబ్బు చేసుకున్నాడా రాక్షసుడు. మూడు నెలల పాటు ఆ చిన్నారిని హింసించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగింది. అనారోగ్యం కారణంగా ఓ వ్యక్తి దగ్గర 5 వెలు తీసుకున్నా ఆ డబ్బులు కట్టలేకపోయాడు . అయితే తన కూతురిని పంపిస్తే సరిపోతుందని అన్నారు..

 

ఎటు గత్యంతరం లేక ఆమెను పంపించారు.. 13 ఏళ్ల వయసులో అన్నీ ఆమెతో తీర్చుకున్నాడు.. అదే కాకుండా విషయం బయటకు చెబితే తండ్రిని చంపేస్తానని బెదిరించి.. మూడు నెలల పాటు బందీగా పెట్టుకుని అతడి స్నేహితులనూ పిలిచి పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు చేశారు. అలా చేసిన అతను ఆమెతో వ్యభిచారం కూడా చేయించి డబ్బులు సంపాదించాడు..

 

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆ బాలిక భయపడుతూనే తన బాధను తల్లిదండ్రులతో చెప్పుకుంది. దీంతో వాళ్లు అమ్రోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. భఖర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి రేప్ చేయడమే కాకుండా ఆ చిన్నారిని వ్యభిచారంలోకి కూడా దించి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై ఈ దారుణానికి పాల్పడిన ఏడుగురిని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. వారిపై కేసులు పెట్టిన విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: