ముందే ఇది చలికాలం. ఈ కాలంలో ఎంత వేడి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే అలా వేడి వేడిగా తినాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. అది ఏంటంటే.. చికెన్ సూప్..  చికెన్ సూప్‌ అనే కాదు.. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ సూప్ అయినా సరే ఈ చలికాలంలో తీసుకుంటే అదిరిపోతుంది. అయితే ప్రస్తుతం చికెన్ సూప్‌ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 

కావలసిన పదార్థాలు... 

 

బోన్‌లె్‌స చికెన్‌ - పావు కిలో, 

 

క్యారెట్‌ - ఒకటి, 

 

స్వీట్‌కార్న్‌ - అరకప్పు, 

 

నిమ్మరసం - రెండు టేబుల్‌ స్పూన్లు, 

 

అల్లం - చిన్నముక్క, 

 

వెల్లుల్లి - రెండు రెబ్బలు, 

 

నూనె లేక నెయ్యి - ఒక టీస్పూన్‌, 

 

బిర్యానీ ఆకు- ఒకటి, 

 

మిరియాలు - నాలుగైదు, 

 

దాల్చిన చెక్క - చిన్నముక్క.

 

తయారీ విధానం... 

 

అల్లం, వెల్లుల్లి మెత్తగా దంచుకోవాలి. కుక్కర్‌లో చికెన్‌ తీసుకుని మూడు కప్పుల నీళ్లు పోయాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి మూడు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు, స్వీట్‌కార్న్‌ వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్‌ సూప్‌ను అందులో పోసి మరికాసేపు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసుకుని దింపుకోవాలి. నిమ్మరసం, మిరియాల పొడి చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి. అంతే.. చలి కాలంలో వేడి వేడిగా నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ చికెన్ సూప్. 

మరింత సమాచారం తెలుసుకోండి: