కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం- ఒక కప్పు
బెల్లం- ఒకటిన్నర కప్పు
నెయ్యి- పావుకప్పు
పెసరపప్పు- మూడు టేబుల్‌స్పూన్లు

 

పచ్చ కర్పూరం పొడి- చిటికెడు
జాజికాయ పొడి- చిటికెడు
నీళ్లు- నాలుగు కప్పులు

 

యాలకుల పొడి- పావు టీస్పూన్‌
జీడిపప్పు- కొద్దిగా
ఎండు ద్రాక్ష- కొద్దిగా

 

త‌యారీ విధానం:
ముందుగా స్టౌ మీదు పాన్ పెట్టుకొని.. అందులో నెయ్యి వేసి జీడిప‌ప్పు, ఎండు ద్రాక్ష వేగించి ప‌క్కన పెట్టుకోవాలి. త‌ర్వాత బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక పాన్‌లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి స్లో ఫ్లేమ్‌ పై ఉడికించాలి. బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకోవాలి. అప్పుడు బెల్లం పానకం సరిగ్గా ఉన్నట్టు.

 

అందులో ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కలపి చిన్నమంటపై నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి. మ‌రియు యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి. చివ‌రిగా జాజికాయ పొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ చక్కెర పొంగలి రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: