ఇప్పుడు కార్యక్రమం ఏదైనా..అది చావైనా, పెళ్లయినా.. ఫ్రెండ్స్ తో మీటింగ్ అయినా.. పేరెంట్స్ తో డిస్కషన్ అయినా సరే.. చివరకు ఓ సెల్ఫీతో ముగియాల్సిందే. సెల్ఫీ తీసుకోవడం దాన్ని ఫేస్ బుక్ లోనో.. వాట్సాప్ స్టేటస్ లోనో పెట్టేయడం ఓ ట్రెండ్ గా మారింది.

 

మరి అలాంటిది.. ఏకంగా సెల్పీలు దిగేందుకే ఓ ప్రత్యేక ఏర్పాటు ఉంటే.. సెల్ఫీలు తీసుకునేందుకు అనువైన సెట్టింగులతో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తే.. భలే బావుంటుది కదూ. గల్ఫ్ లో అలాంటి ఓ సెల్ఫీ మ్యూజియం ఏర్పాటు చేశారట. దుబాయిలో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారట. ఫొటో ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా 'ది సెల్ఫీ కింగ్‌డమ్‌' పేరుతో ఈ ప్రత్యేక ఫొటో మ్యూజియం ప్రారంభమైంది.

 

ఈ సెల్ఫీ కింగ్‌డమ్‌ వ్యవస్థాపకురాలు రాణియా నఫా మాట్లాడుతూ.. ''సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఇక్కడ చాలా అనేక రకాల రంగులతో, బ్యాక్‌గ్రౌండ్‌ గదులతో పాటు సరైన లైటింగ్‌ ఏర్పాటు చేశారు. కళ, సృజనాత్మకత, వ్యక్తిగత స్వేచ్ఛా వాతావరణంతో కూడిన సెల్ఫీ అనుభవాన్ని పొందవచ్చు.

 

ప్రతి ఒక్కరూ ఇక్కడి వచ్చి సెల్ఫీలలో అనుభవం, మధుర జ్ఞాపకాలను సృష్టించుకోవాలని కోరుతున్నాం అన్నారు. అంతేకాదు.. మీ సెల్ఫీ సామర్థ్యాలపై మీకు నమ్మకం లేకపోతే వాళ్లే ఓ ఫొటోగ్రాఫర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. మీరు అదిరిపోయే సెల్ఫీలు అందజేస్తారు. ఇండియాలో కూడా ఇలాంటి మ్యూజియం ఉంటే బావుంటుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: