ముందే ఇది చలికాలం. ఈ కాలంలో ఎంత వేడి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే అలా వేడి వేడిగా తినాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. అది ఏంటంటే.. చికెన్ కార్న్ సూప్.. చికెన్ కార్న్ సూప్ అనే కాదు.. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ సూప్ అయినా సరే ఈ చలికాలంలో తీసుకుంటే అదిరిపోతుంది. అయితే ప్రస్తుతం చికెన్ కార్న్ సూప్ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 

కావలసిన పదార్ధాలు... 

 

స్వీట్‌కార్న్‌ - అరకప్పు, 

 

చికెన్‌ స్టాక్‌ - నాలుగు కప్పులు, 

 

మొక్కజొన్న పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

కోడిగుడ్డు - ఒకటి, 

 

ఉడికించిన చికెన్‌ ముక్కలు - అరకప్పు, 

 

వెనిగర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.

 

తయారీ విధానం... 

 

ఒక పాత్రలో మొక్కజొన్న పిండి తీసుకుని, అరకప్పు నీళ్లు పోసి పక్కన పెట్టాలి. మరో పాత్రలో స్వీట్‌ కార్న్‌, చికెన్‌ స్టాక్‌ వేసి ఉడికించాలి. నీళ్లు పోసి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని అందులో వేయాలి. చిన్నమంటపై పదినిమిషాల పాటు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి ఉడికించిన చికెన్‌ ముక్కలు వేసి మరికాసేపు ఉంచాలి. కోడిగుడ్డు కొట్టి కలుపుకోవాలి. వెనిగర్‌ వేసి కాసేపు చిన్నమంటపై ఉంచి, దింపుకొని వేడివేడిగా సర్వ్‌ చేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఇంకేందుకు ఆలస్యం.. ఈ చలిలో ఈ వేడి వేడి కార్న్ సూప్ రుచిని పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: