కావాల్సిన ప‌దార్థాలు:
గోంగూర- మూడు కట్టలు
పల్లీలు- ఒక కప్పు
ఎండు మిర్చి- ప‌ది
ధనియాలు- ఒక టీ స్పూను

 

పచ్చి మిర్చి- నాలుగు
నూనె- రెండు స్పూన్లు
ఆవాలు- అర టీ స్పూను
జీలకర్ర- అర టీ స్పూను

 

వెల్లుల్లి రేకలు-  ఐదు
ఉల్లి తరుగు- పావు కప్పు
ఉప్పు- తగినంత
చింతపండు- కొద్దిగా

 

తయారీ విధానం: ∙
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకొని నూనె వేసి, అది కాగాక ఎండు మిర్చి, ధనియాలు వేసి వేయించాలి. అందులోనే వెల్లుల్లి రేకలు, పల్లీలు వేసి పల్లీల పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి. 

 

ఆ త‌ర్వాత పాన్‌లోనే మరి కాస్త నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించాలి కొద్దిగా వేగాక చింతపండు జత చేసి మరోమారు వేయించాలి. ఆకు బాగా మెత్తబడ్డాక దింపి చల్లార్చాలి. ఇప్పుడు మిక్సీలో పల్లీలు వేసి మెత్తగా చేయాలి. అందులోనే పచ్చి మిర్చి, గోంగూర, ఉప్పు జత చేసి మెత్తగా నీటి సాయంతో మిక్సీ పట్టాలి. త‌ర్వాత ఈ ప‌చ్చ‌డిని తాలింపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంతే నోరూరించే గోంగూర ప‌ల్లీల ప‌చ్చ‌డి రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: