ఒకప్పుడు ఆడపిల్లలకు 12 ఏళ్లు నిండితే.. అబ్బాయికి 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసేవారు. ఆ తర్వాత అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు వివాహ వయస్సుగా నిర్ణయించారు. కానీ ఇప్పుడు చాలా మంది 30 దాటితే కానీ పెళ్లి చేసుకోవడం లేదు. మరికొందరు 35 ఏళ్లకూ పెళ్లి చేసుకుంటున్నారు.

 

మరి అలాంటి వాళ్లు వివిధ కారణాలతో గర్బం దాల్చడం ఆలస్యమైతే పరిస్థితి ఏంటి.. ? 40 ఏళ్ల వయసులోనూ గర్భం దాల్చొచ్చు కానీ.. ముందుగానే డాక్టర్ని సంప్రదించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ల సమతూకం ఉందేమో తెలుసుకోవాలి. ఆ సమయంలోనే వైద్యులు అండాల నాణ్యతనూ అంచనా వేస్తారు. ఏ మేరకు అండాలు విడుదల అవుతున్నాయనే దాన్ని బట్టి నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

 

గర్భం దాల్చాక జన్యుపరమైన సమస్యలు లేకుండా ఉండేందుకు టిఫా, ఫీటల్ ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలి. నలభై దాటాక.. అధికరక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు వచ్చే ఛాన్సుంది. పుట్టబోయే బిడ్డకు మాయ నుంచి రక్తసరఫరా అందడం సమస్య కావొచ్చు. సహజ కాన్సు కన్నా సిజేరియన్ అయ్యే అవకాశాలే ఎక్కువ.

 

40 ఏళ్ల తర్వాత పిల్లలను కంటే.. బిడ్డలో అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గర్భం దాల్చడాని కన్నా ముందే ఫోలిక్ యాసిడ్ మాత్రల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వయస్సులో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువనే విషయం కూడా మరవకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: