ఉసిరి జామ్.. తినడానికి ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఈ ఉసిరి జామ్ ను మీరు ఎప్పుడైనా తిన్నారా ? ఎలా చేసుకోవాలో తెలుసా ? ఎలా చేసుకుంటే బాగుంటుందో తెలుసా ? అసలు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఉసిరి జామ్ అద్భుతంగా ఉంటుంది. 

 

కావలసిన పదార్ధాలు.. 

 

ఉసిరి తురుము - ఒక కప్పు, 

 

నీళ్ళు - పావు కప్పు, 

 

పంచదార - ఒకటిన్నర కప్పు, 

 

యాలకుల పొడి - అర టీ స్పూను, 

 

దాల్చిన చెక్క- అంగుళం ముక్క.

 

తయారీ విధానం... 

 

దళసరి అడుగున్న పాత్రలో ఉసిరి తురుము, పంచదార, నీళ్ళు తీసుకొని, పంచదార కరిగేవరకు ఉడికించాలి. లేత తీగపాకం వచ్చే ముందు మంట తగ్గించి యాల కుల పొడి, దాల్చిన చెక్క వేసి మరో మూడు నిమిషాలు ఉంచాలి. తర్వాత పాత్రను దించేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత దాల్చిన చెక్క తీసేసి, గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. బ్రెడ్‌పైనే కాకుండా, పరగడుపున అర టీ స్పూను చొప్పున లేహ్యంగా తీసుకున్నా కూడా ఆరోగ్య రీత్యా మంచిది. చూశారుగా.. ఈ ఉసిరి జామ్ తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: